ఇందిరమ్మ పేరు పెడితే ఇండ్లు ఇవ్వము..!
బేగంపేటలోని హోటల్ ఐటీసీ కాకతీయలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ ఆధ్వర్యంలో అర్భన్ పవర్ సెక్టర్ పై జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గోన్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి “మూసీ పునరుజ్జీవం….నగర సమగ్రాభివృద్ధి….గ్రీన్ ఎనర్జీ, అర్బన్ హౌసింగ్ పై వచ్చే కేంద్ర బడ్జెట్ లో సమృద్ధిగా నిధులు కేటాయించాలి..
పేదలకు ఇరవై లక్షల ఇండ్లను ఇవ్వాలని కోరిన సంగతి తెల్సిందే. ఈ విషయంలో కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ ” పేదలకు ఇచ్చే ఇండ్లకు ఇందిరమ్మ పేరు పెడితే ఒక్క ఇల్లు కూడా ఇవ్వము అని తేల్చి చెప్పారు.
ప్రధానమమ్త్రి ఆవాస్ యోజన పేరు పెడితేనే నిధులిస్తామని అన్నారు. అలాగే కాంగ్రెస్ ఫోటోలు పెడితే రేషన్ కార్డులు కూడా ఇవ్వబోము.. తామే ముద్రించి ఇస్తామని పేర్కోన్నారు.