మైదానంలో తిట్టడంపై హిట్ మ్యాన్ క్లారిటీ..!

 మైదానంలో తిట్టడంపై హిట్ మ్యాన్ క్లారిటీ..!

Rohit Sharma Indian cricketer

Loading

టీమిండియా క్రికెట్‌లో ఒక్కో కెప్టెన్‌ది ఒక్కో శైలి. కొందరు కూల్‌గా అన్ని వ్యవహారాలు చక్కబెడతారు.. మరికొందరు చాలా కోపాన్ని చూపిస్తారు. కూల్ కెప్టెన్ గా ముద్రపడిన టీమిండియా లెజండ్రీ స్టార్ మాజీ ఆటగాడు.. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని లాంటి అరుదైన సారథులు ఎంత ఒత్తిడి ఉన్నా కానీ తాము కూల్‌గా ఉంటారు.. మైదానంలో ఏ పరిస్థితుల్లోనైనా ఇతర ఆటగాళ్లనూ అలాగే ఉంచుతారు.

విరాట్ కోహ్లీ వంటి కెప్టెన్స్ దూకుడు కనబరుస్తూ, సహచరులనూ అదే తోవలో నడిపించి కావాల్సిన రిజల్ట్ రాబడతారు. ఈ రెండింటినీ కలిపితే అది రోహిత్ శర్మ స్టైల్ ఆఫ్ కెప్టెన్సీ అనొచ్చు. టీమ్‌ను కూల్‌గా నడిపిస్తూనే అవసరమైన సమయంలో అగ్రెషన్‌ డోస్‌నూ పెంచుతుంటాడు. ఈ క్రమంలో పలుమార్లు బూతులు, తిట్ల దండకం అందుకున్న సందర్భాలూ ఉన్నాయి. దీనిపై తాజాగా రియాక్ట్ అయ్యాడు హిట్‌మ్యాన్.

మైదానంలో కొన్నిసార్లు ఎమోషనల్ అవుతుంటానని హిట్ మ్యాన్ చెప్పాడు. మ్యాచ్ కండీషన్స్‌ను బట్టి భావోద్వేగానికి గురవుతుంటానని తెలిపాడు. ఇలా ఎమోషనల్ అయిన సందర్భాల్లో కొన్నిసార్లు పరుష పదాలు వాడాల్సి వస్తుందన్నాడు హిట్‌మ్యాన్. అయితే అభ్యంతకర పదాలు వాడినంత మాత్రాన తప్పుగా అనుకోవాల్సిన పని లేదన్నాడు. తామంతా ఒక టీమ్ ..

దేశం కోసం కలసి ఆడుతున్నామనే భావన లోలోపల ఉంటుంద న్నాడు రోహిత్. తాము ఒక జట్టు మాత్రమే కాదు.. ఫ్యామిలీ కూడా అని స్పష్టం చేశాడు. ఎవరి మీదైనా తాను సీరియస్ అయినా, ఏమైనా అనేసినా అది తీవ్రంగా భావించొద్దన్నాడు. తామంతా సోదరులమని, ఒక కుటుంబంలో ఉండే ఎమోషన్స్, బాండింగ్, రెస్పెక్ట్ తమ మధ్య ఉందన్నాడు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *