గ్రూప్ -1 రద్ధుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
గ్రూప్ – 1 మెయిన్స్ రద్ధు చేయాలంటూ కొంతమంది అభ్యర్థులు రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెల్సిందే. వీరి పిటిషన్లపై విచారించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
విచారణ సందర్భంగా ” నోటిఫికేషన్ జారీ చేయడమే చట్ట విరుద్ధం అని భావించినప్పుడు అప్పుడేందుకు హైకోర్టును ఆశ్రయించలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే రెండు సార్లు రద్ధయింది. మొదటిసారి ఐదు లక్షల మంది రాశారు.
ఇప్పుడేమో ఆ సంఖ్య మూడు లక్షలకు వచ్చింది. మళ్లీ రద్ధంటే కుదరదు. ఇంకా ఎన్నేళ్ళు ఇలా ..?. వీటిని ఇలాగే అనుమతిస్తే కొత్త అభ్యంతరాలతో మరింతమంది వస్తారు. అప్పుడు రద్ధు చేయాల్నా అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.