మాజీ మంత్రి కేటీఆర్ కు హైకోర్టు షాక్..!
ఫార్ములా ఈ రేసు కారు కేసులో తనను ఏసీబీ ఆరెస్ట్ చేయద్దని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెల్సిందే.
ఈ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలను విన్న హైకోర్టు కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టీవేసింది. దీంతో ఏసీబీ ఈ కేసులో దూకుడు పెంచింది.
ఫార్ములా -ఈ రేసు కారు కేసుకు సంబంధించి పలుచోట్ల ఏసీబీ సోదాలను నిర్వహిస్తుంది. ఏపీలో విజయవాడ.. తెలంగాణలో హైదరాబాద్ లో గ్రీన్ కో, ఏస్ జెన్ నెక్ట్స్ ఆఫీసులలో రికార్డులను పరిశీలిస్తుంది.