సర్కార్ కు హైకోర్టు షాక్..!

తెలంగాణలో హైడ్రా పేరుతో అక్రమ నిర్మాణాలు కూల్చుతున్నామంటూ రేవంత్ రెడ్డి సర్కార్ ఇటివల పలు ఇండ్లను కూల్చింది.అయితే ఈ క్రమంలో ఎన్నో ఏండ్లుగా నివాసముంటూ,ఇంటి నంబర్లు,కరెంట్ కలెక్షన్లు,అన్నీ అనుమతులు ఉన్న ఇండ్లను కూడా కూల్చడంతో ప్రజలు తీవ్ర నిరసన తెలపడం,ప్రభృత్వంపై తీవ్ర విమర్శలొచ్చాయి..
కొందరు కోర్టులను ఆశ్రయించారు..కోర్లులకు సెలవులు ఉండే వారాంతాలైన శని,ఆదివారాల్లో కూల్చివేతలు జరపడం,అలా చేయకూడదని కోర్టులు హెచ్చరించినా హైడ్రా తమ తీరు మార్చుకోకపోవటంతో మరో మారు హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది..ఎన్ని సార్లు చెప్పినా నిబంధనలు ఎందుకు పాటించరు? చట్టివిరుద్ధంగా కూల్చివేతలు చేస్తారా..? అంటూ ప్రశ్నించింది..
సెలవు రోజు కూల్చివేతలు చేయడం అలవాటుగా మారిందని,సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ముత్తంగిలో సెలవు రోజు (ఆదివారం) ప్రవీణ్ అనే వ్యక్తికి సంబంధించిన షెడ్ ను అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నా కూడా అతనికి నమాచారం ఇవ్వకుండా కూల్చివేయడంతో అతను హైకోర్టును ఆశ్రయించాడు..విచారణ చేపట్టి అక్కడి హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ పై జస్టిస్ కె.లక్ష్మణ్ మండిపడ్డారు..దీంతో సెలవు రోజు కూల్చివేతలు చేయొద్దని గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఎందుకు అమలు చేయడం లేదని హైడ్రాకు జస్టిస్ కె.లక్ష్మణ్ వేసారు..
