హైడ్రా కు హైకోర్టు షాక్
హైడ్రా కు హైకోర్టు షాకిచ్చింది. హైడ్రా గురించి అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టు స్పందిస్తూ ” హైడ్రా ఏర్పాటు చేయడం అభినందనీయమే. కానీ దాని పనితీరే చాలా అభ్యంతరకరంగా ఉంది అని వ్యాఖ్యానించింది.
అమీన్ పూర్ ఎమ్మార్వో, హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాథ్ తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. కోర్టు సెలవుల్లో ఉన్నసమయంలో నోటీసులు ఇవ్వడం ఏంటీ..?. అత్యవసరంగా ఎందుకు కూల్చుస్తున్నారు..? అని ప్రశ్నించింది.
హైడ్రాకు కూల్చివేతలు తప్పా మరో పాలసీ లేనట్లు ఉంది అని తీవ్ర అగ్రహాం వ్యక్తం చేసింది. తాము అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వాలి. అడిగిన ప్రశ్నపై దాటవేత వద్దు అని కమీషనర్ ను హెచ్చరించింది.