HCU విద్యార్థుల పోరాటాలకు మద్ధతుగా హీరోయిన్..!

కంచ గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను వేలం వేయద్దంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై గత వారం రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు పోరాటాలు.. ధర్నాలు చేస్తున్న సంగతి తెల్సిందే. వీరి పోరాటానికి రాజకీయ సినీ క్రీడా అనేక రంగాలకు చెందిన ప్రముఖులు మద్ధతు నిలుస్తున్నారు.
తాజాగా ప్రముఖ సినీ నటి రేణూ దేశాయ్ హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటాలకు మద్ధతుగా ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో యూనివర్సిటీ విద్యార్థులు పోరాడుతున్న భూముల వివాదం గురించి నాకు రెండు రోజుల ముందే తెల్సింది. ఈ వివాదం గురించి పూర్తిగా తెల్సిన తర్వాతనే స్పందిద్దామని ఇప్పటివరకూ ఆగాను. ఈ వివాదం గురించి పూర్తి సమాచారం తెలుసుకున్నాను. ఇప్పడు స్పందిస్తున్నాను.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను ఓ తల్లిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు నలబై నాలుగేండ్లు. నాకు పిల్లలున్నారు. నా పిల్లలు.. మీపిల్లందరికీ వాటర్ కావాలి.. ఆక్సిజన్ కావాలి. మంచి భవిష్యత్తు కావాలి. నాలుగోందల ఎకరాల్లో స్వచ్చమైన అడవి అంటే మాములు మాటలు కాదు. అభివృద్ధి చేయాలి. తప్పదు. భవిష్యత్తు తరాలకు .. నేటి యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి.
కానీ ప్రకృతిని ధ్వంసం చేసి అభివృద్ధి చేయడం ఎవరికి మంచిది కాదు. అక్కడ కాకుండా వేరే చోట అభివృద్ధి చేయండి. భవిష్యత్తు తరాలకు ఆక్సిజన్ తో పాటు ఈ అడవిని కానుకగా అందిద్దాము.అడవులను ఇలా ధ్వంసం చేసుకుంటూ పోతే ప్రకృతి మనల్ని ధ్వంసం చేస్తుంది. అసలే ఆక్సిజన్ కొరత.. వానల్లేవు. ఇలా అరణ్యాలను లేకుండా చేస్తే మానవ మనుగడ ఉండదని ఆమె హెచ్చారిస్తూ ఇప్పటికైన ఆ భూముల వేలం ఆపండంటూ ఆ వీడియోలో పేర్కోన్నారు.
