వరద బాధితులకు అండగా హీరో విశ్వక్ సేన్

Vishwak Sen Indian actor and director
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వరదలతో.. భారీ వర్షాలతో నిరాశ్రయులైన వారికి అండగా నిలిచారు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్. ఇందులో భాగంగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరో ఐదు లక్షల రూపాయలను విరాళంగా ఇస్తున్నట్లు హీరో విశ్వక్ సేన్ ప్రకటించారు.
ఈ విరాళాలను మొత్తం ముఖ్యంత్రులకు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ విపత్తు సమయంలో సహాయక చర్యలకు మద్ధతుగా ఈ విరాళం ఇస్తున్నాను. బాధితులకు మనమంతా అండగా నిలవాలి.. మనకు చేతనైనంత సాయం అందించాలి.
ప్రకృతి ముందు అందరూ సమానులే.. ఎవరికి ఏ కష్టమోచ్చిన ఒకరికి ఒకరూ భరోసాగా నిలవాలి అని ఆయన తన అభిమానులకు ,ప్రజలకు పిలుపునిచ్చారు. తన అభిమాన హీరో నందమూరి తారకరామారావు కోటి రూపాయల విరాళం ప్రకటించిన కొద్దిసేపటికే హీరో విశ్వక్ సేన్ పది లక్షల విరాళం ప్రకటించడం గమనార్హం.
