చలికాలంలోనే గుండెపోటు ఎక్కువ ఎందుకు..?
సహాజంగా మిగతా కాలాలతో పోల్చుకుంటే చలికాలంలోనే గుండెపోటు సంఘటనలు చోటు చేసుకుంటాయని వైద్య నిపుణులు చెబుతుంటారు. చలికాలంలోనే గుండెపోటు సంబంధిత సమస్యలను మనం ఎక్కువగా ఆరోగ్య పరంగా ఎదుర్కుంటాము.
దీని వెనక అసలు కారణం ఉందని వారు చెబుతున్నారు. చలికాలంలో ఉండే చలి వల్ల కండరాలు బిగుతుగా అయి గుండెకు ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. ఫలితంగా శరీరానికి తగినంత రక్తము సరఫరా చేసేందుకు గుండె పని పెరుగుతుంది. ఇది బ్లడ్ ప్రెజర్ పెరగడానికి దారి తీస్తుంది.
బ్లడ్ ప్రెజర్ వల్ల శ్వాస తీసుకోవడంలో ఎదురయ్యే ఇబ్బంది గుండెపై ఒత్తిడిని పెంచుతుంది. దీంతో హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. చలికాలం శరీరాన్ని వెచ్చగా ఉండేలా చూస్కోవాలి. తగినంత వ్యాయామం చేయాలి. దీని వల్ల గుండె జబ్బులు రాకుండా చూస్కోవచ్చు.