HCU భూముల వివాదం – ఆఫోటో గ్రాఫర్ ను పట్టిస్తే 10లక్షలు…!

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలి భూముల్లో ఎలాంటి పనులు చేపట్టోద్దు. చెట్లను మొక్కలను నరకవద్దు. అంత అత్యవసరంగా కార్యక్రమాలు చేయాల్సిన పని ఏముంది. అంత అవసరం ఏమోచ్చిందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు సీఎస్ శాంతికుమారి ఐఏఎస్ పై తీవ్ర అగ్రహాం వ్యక్తం చేసిన సంగతి తెల్సిందే.
అంతే కాకుండా తదుపరి ఆదేశాలను జారీ చేసేవరకూ ఎలాంటి పనులు చేయద్దు. చెట్లను మొక్కలను కొట్టేయద్దంటూ ఈ నెల పదహారు తారీఖుకు విచారణను వాయిదా వేసింది. ఈ క్రమంలో హెచ్ సీయూ భూములను కొట్టేస్తుంటే నెమళ్లు, జింకలు జేసీబీలకు ఎదురుగా ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆఫోటో నిజమైనది కాదని అధికార కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే ఆ ఫోటో గురించి ఆ పార్టీ నేత రోహిన్ రెడ్డి ఈ విషయంపై ట్విట్టర్‌లో స్పందిస్తూ “ఇంత అంత అద్భుతమైన ఫోటోను తీసిన వ్యక్తి ఎవరో గుర్తించి మాకు సమాచారం అందించండి.. వారికి రూ. 10 లక్షల రివార్డు ఇస్తాం” అని ఆయన ప్రకటించారు. ఈ ఫోటో నిజమైనదా లేదా ఎడిట్ చేసిందనే అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తెగ చర్చనీయాంశంగా మారింది.

https://x.com/DrCRohinReddy/status/1907686784416301194/photo/1
