ఈ పంచాయితీ కార్యదర్శి చేసిన పనికి అందరూ…?

 ఈ పంచాయితీ కార్యదర్శి చేసిన పనికి అందరూ…?

Loading

వారం కింద టీవి లో రవితేజ దేవుడు చేసిన మనుషులు అనే సినిమా వచ్చింది అందులో అలీ లక్ష్మి దేవతకు పూజ చేస్తూ అమ్మా నన్ను కరుణించి డబ్బులు ఇవ్వు అంటాడు వెంటనే లక్ష్మి దేవత ఓ డబ్బు సంచి వాడి ఎదురుగా పడేస్తది..

ఆ సీన్ చూసాక నేనున్న స్ట్రగుల్స్ కి నీ అమ్మ ఒక్కొక్కడు కోట్లు సంపాదిస్తుండు ఎక్కడన్నా రోడ్డు మీద ఒక్క ఐదు లక్షలు దొరుకుతే నా బాధలు అన్ని పోయేవి అని ఆ సీన్ చూస్తూ మా అమ్మాయితో అన్నాను..

ఇవాళ పొద్దున డ్యూటీ వెళ్ళేటపుడు రామడుగు కొత్త బ్రిడ్జి పైన 500 నోట్ల కట్ట కనిపించింది అది చూసి ఫస్ట్ గుండె జల్లుమంది ఆనందం తో వెంటనే బండి ఆపి ఆ డబ్బులు తీసుకుని జేబులో పెట్టుకుని ఆఫీస్ కి వెళ్లి డబ్బుల కట్ట తీసి లెక్క పెడితే 50 వేలు ఉన్నాయ్ అవి దొరికాక ఒక్క నిమిషం హ్యాపీ ఫీల్ అయ్యా కానీ ఆ తరువాత నుండి స్టార్ట్ అయింది అసలు బాధ..

ఆ పైసలు పోగొట్టుకున్న వాళ్లకు ఎంత అవసరమో ఎవరికైనా అప్పు కట్టేవి కావచ్చు లేక ఎవరైనా టీనేజ్ పిల్లలు పోగొడితే ఇంట్లో వాళ్ళు వాళ్ళను తిట్టడం వళ్ళ వాళ్ళు మనస్థాపం చెంది ఏమైనా చేసుకుంటే ఆ పాపం నేను మోయలేను అనిపించింది

నాకేం చేయాలో అర్థం కాక వెంటనే ఎమ్మెల్యే Medipally Sathyam అన్నకి పోన్ కొట్టి అన్నా రోడ్ మీద డబ్బుల కట్ట దొరికింది అవి పోగొట్టుకున్న వాళ్ళకే తిరిగి అందేలా చేయు అన్నా ప్లిజ్ అన్నాను అన్న వెంటనే కరీంనగర్ CP సార్ కి కాల్ చేసి విషయం చెప్పి డబ్బులు అక్కడ హ్యాండొవర్ చేయమన్నారు CP గారి ఆఫీస్ కి మధ్యాహ్నం వెళితే సార్ బయటకు వెళ్లారు అన్నారు ఈవినింగ్ 4:30 కి రమ్మన్నారు

ఆ తరువాత డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తులు రామడుగు పోలీస్ స్టేషన్ లో చెప్పగా వారు నన్ను అప్రొచ్ అయ్యారు

సిరిసిల్ల జిల్లా చిర్లవంచ గ్రామం వాళ్ళు వాళ్ళ ఊర్లో కొత్తగా పెద్దమ్మ గుడి నిర్మాణం చేసుకుని పెద్దమ్మ తల్లి విగ్రహం రామడుగులో కొనడానికి వచ్చి ఆ డబ్బులు పోగొట్టుకున్నారు అని విచారణ లో తెలిసింది వాళ్లకు డబ్బులు ఇచ్చాక చాలా హ్యాపీ అయ్యారు అవి పోయినపుడు మొదటి సారీ దేవత విగ్రహం కొనడానికి పోతే ఇలా జరిగిందేంటి అని చాలా బాధ పడ్డారట బట్ ఫైనల్ గా కథ సుఖాంతం అని శ్రీనివాస్ సార్ల అనే జూనియర్ పంచాయితీ కార్యదర్శి ఈరోజు సోమవారం తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు..ఈ విషయంపై అందరూ శభాష్ అంటూ పొగడ్తల వర్శం కురిపిస్తున్నారు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *