హారీష్ శంకర్ కీలక నిర్ణయం
మాస్ మహారాజు రవితేజ హీరోగా వచ్చిన మిస్టర్ బచ్చన్ మూవీ ప్లాప్ అయిన సంగతి తెల్సిందే.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించగా.. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది.
. దీంతో ఈ చిత్రం దర్శకుడు హరీశ్ శంకర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలస్తుంది. ఈ మూవీ వలన నష్టపోయిన నిర్మాతకు హరీశ్ శంకర్ తన రెమ్యూనరేషన్ నుంచి రూ.2 కోట్లు వెనక్కి ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమాకు హరీశ్ శంకర్ దర్శకుడిగా రూ.10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇందులో నుంచే నిర్మాతకు రూ.2 కోట్లు తిరిగి ఇచ్చినట్లు టాక్. అయితే హరీశ్ శంకర్ చేసిన పనికి రవితేజ అభిమానులతో పాటు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.