మంత్రి కోమటిరెడ్డికి హారీష్ రావు మాస్ కౌంటర్..!
తెలంగాణ రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈరోజు శనివారం రైతుభరోసా పై చర్చ జరుగుతుంది. ఈ చర్చలో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ పేరుతో యాబై వేల కోట్లకు పైగా రూపాయలను లూటీ చేసింది. రాష్ట్రంలో ఏ జిల్లాకైన వెళ్దాము.. ఏ నియోజకవర్గానికైన వెళ్దాము.. సిరిసిల్ల వెళ్దాము.. సిద్ధిపేట వెళ్దాము.. గజ్వేల్ వెళ్దాము.
ఏ నియోజకవర్గంలోనైన పూర్తిగా మిషన్ భగీరథ నీళ్లు వస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి.. మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. దీనికి కౌంటర్ గా మాజీ మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ ” మిషన్ భగీరథకు ఖర్చు అయిందే రూ.28,000 కోట్లు.. మరి ఈ 50 వేల కోట్ల అవినీతి జరిగిందని మంత్రి కోమటీరెడ్డి వెంకటరెడ్డి అబద్ధాలు ఆడుతున్నాడు.. సభను తప్పుదోవ పట్టిస్తున్నారు.
ఈ మాటలను అసెంబ్లీ రికార్డుల నుండి తప్పించాలి. గజ్వేల్ సిరిసిల్ల సిద్ధిపేట ఎందుకు. ? . మేము అధికారంలోకి రాకముందు నల్గోండ జిల్లా ప్లోరైడ్ సమస్యతో బాధపడుతుంది. మేము అధికారంలోకి వచ్చాక మిషన్ భగీరథతో ప్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టింది నిజం కాదా..? కండ్ల ముందు ఇంత సత్యం కన్పిస్తున్నా అబద్ధాలు ఆడటం మంత్రి కోమటీరెడ్డికే దక్కిందని మాస్ కౌంటరిచ్చారు.