రేవంత్ రెడ్డికి హారీష్ రావు బహిరంగ లేఖ..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్యేహరీశ్ రావు బహిరంగ లేఖ రాసారు.
రాష్ట్రంలో లక్షలాది మంది పేదలకు రేషన్‌కార్డులను దూరం చేయాలని కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం నాడు కేసీఆర్ సర్కార్ ఆదాయ పరిమితిని, భూపరిమితిని పెంచిందని.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక మార్గదర్శకాల ప్రకారం రేవంత్ సర్కార్ ఆ మార్గాన్నే అనుసరించాలని సూచించారు.
ఇటీవల కులగణన సర్వే సందర్భంగా సర్కార్ చెప్పిందొకటి, రేషన్‌కార్డుల విషయంలో ప్రస్తుతం అనుసరిస్తున్న మార్గం మరొకటని ఆయన విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌కార్డుల జారీ విషయంలో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసి అర్హులైన ప్రతీ ఒక్కరికీ రేషన్‌కార్డులు జారీ చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు.
