రేపు యాదాద్రికి మాజీ మంత్రి హరీష్ రావు
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి. సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు రేపు గురువారం యాదగిరి గుట్టలోని లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకోనున్నారు.
గత ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రూ.2లక్షల రుణమాఫీ చేస్తానని యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామిపై ఒట్టుపెట్టి ఆయన మాట తప్పారు దానికి పాపపరిహారం చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి చేసిన పాపం ప్రజలకు తాకకుండా చూడాలని తాను నర్సింహస్వామిని ప్రార్థిస్తానన్నారు. పాపాత్ముడైన సీఎం రేవంత్‌ను క్షమించాలని దేవుడిని వేడుకుంటానని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఓ పత్రిక ప్రకటనను విడుదల చేశారు..