ఘోర రోడ్డు ప్రమాదం..స్పందించిన హరీష్ రావు..
వరంగల్ మామునూరు భారత్ పెట్రోల్ పంప్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఆటో ను రైలు పట్టాల లోడుతో వెళ్తున్న లారీ డీకొట్టింది..దీంతో ఆటో పై రైలు పట్టాలు పడ్డాయి.ఈ ఘటనలో 7గురు మృతి,చెందారు..మరో 2 గురికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది.మృతుల్లో ఇద్దరు మహిళలు..ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు..
రైలు పట్టాల కింద ఇరుక్కున్న నలుగురు వ్యక్తులు ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు..మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది..ఐనవోలు మండలం పంథిని వద్ద యూరియా బస్తాలు తీసుకేళ్లె ఆటోను ఢీకొట్టి లారీ.. మమునూరు దగ్గర మరో ఆటోను ఢీకొట్టి బోల్తా పడ్డ లారీ.. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణం అంటున్న స్థానికులు..లారీ ఖమ్మం నుంచి వరంగల్ కు వెళ్తుంది.. ఆటో కూడా వరంగల్ వైపే వెళ్తుంది.ఆటోలో ప్రయాణిస్తున్న వ్యవసాయపనిముట్లు చేసే వలసజీవులే కావడం తో మృతుల వివరాలు గుర్తించడం కష్టంగా మారింది..
ఈ ఘటనపై మాజీ మంత్రి,బీఆర్ఎస్ నేత హరీశ్ రావు స్పందించారు.వరంగల్ జిల్లా మామునూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం ఎంతో దురదృష్టకరమని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, గాయపడిన వారికి తక్షణ వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.రైలు పట్టాల కింద ఇరుక్కున్న వారిని రక్షించేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని హరీష్ రావు సూచించారు..