రేవంత్ రెడ్డికి హారీశ్ రావు సవాల్..!

తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి వనపర్తి పర్యటనలో భాగంగా మాట్లాడుతూ “నాడు కాంగ్రెస్ ప్రభుత్వం మొదలెట్టిన ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను తెలంగాణ వచ్చాక పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యం చేసింది. అందుకే ఈ టన్నెల్ లో ప్రమాదం జరిగింది అని ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలపై మాజీ మంత్రి తన్నీరు హారీశ్ రావు స్పందిస్తూ “ఎస్‌ఎల్‌బీసీ కోసం మాపదేండ్ల పాలనలో మేం 3 వేల కోట్లకు పైగా ఖర్చు చేసి 11 కిలోమీటర్లకు పైగా తవ్వాము.. ఈ విషయంపై ఎక్కడికైనా చర్చకు రమ్మంటే అక్కడకు నేను వస్తాను.. నేను చేసింది తప్పు అని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం..ఒప్పు అని నిరూపిస్తే రేవంత్ రెడ్డి తన పదవికీ రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు..
ఎస్‌ఎల్‌బీసీలో పనులు చేయాలి కానీ మమ్మల్ని అంటే ఎలా?.. గతంలో కాళేశ్వరం విషయంలోనూ ఇలానే మాట్లాడారు.. మాకు అప్పగించండి మేము చేసి చూపిస్తాం అంటే వెనక్కి తగ్గారు.. ఎస్‌ఎల్‌బీసీలో 10 రోజులైనా మృతదేహాలను వెలికితీయలేదు.. మీవల్ల కాకపోతే చెప్పండి మేము రెస్క్యూ చేసి చూపిస్తాము. ఎస్‌ఎల్‌బీసీ ఘటనపై సీఎంకు ఫోకస్ లేదు.. ఈ విషయాలన్నీ అసెంబ్లీలో ఎండగడతాం అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు..
