రేవంత్ రెడ్డికి హారీష్ రావు సవాల్

Harish Rao Challenge To Revanth Reddy
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి .. బీఆర్ఎస్ సీనియర్ నేత.. ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. మెదక్ పర్యటనలో ఉన్న మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” మూసీ ప్రక్షాళన కోసం దేనికైన సిద్ధమని ఆయన ప్రకటించారు.
తాము మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు . మూసీ ప్రక్షాళన పేరుతో పేద ప్రజలను.. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఇబ్బందులకు గురి చేయడానికి మేము వ్యతిరేకం..
వాళ్లకు సరైన ఉపాధి అవకాశాలతో పాటు పరిహారం ఇవ్వాలని కోరారు. రేవంత్ రెడ్డి ఎప్పుడు ఎక్కడకు రమ్మంటే వస్తాము.. దమ్ముంటే మా సవాల్ ను స్వీకరించాలని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్నారు.
