లోక్ సభ టీడీపీ విప్ గా బాలయోగి తనయుడు
లోక్ సభ లో టీడీపీ విప్ గా అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుండి టీడీపీ తరపున బరిలోకి దిగి గెలుపొందిన ఎంపీ గంటి హరీశ్ మాథుర్ ని పార్టీ అధినేత..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నియమించారు.
గతంలో హరీశ్ తండ్రి అయిన దివంగత జీఎంసీ బాలయోగి లోక్ సభ స్పీకర్ గా వ్యవహరించారు.స్పీకర్ గా లోక్ సభను చాలా హుందాగా నడిపించి అగ్ర నాయకుల మెప్పు పొందారు.
ఇప్పుడు ఆయన తనయుడు హరీష్ మాధుర్ కు విప్ బాధ్యతలు అప్పగించడంతో తగిన ప్రాధాన్యం ఇచ్చినట్లయిందని టీడీపీ పార్టీ శ్రేణులు అంటున్నాయి. కాగా ఈ ఎన్నికల్లో 3.42 లక్షల ఓట్ల మెజార్టీతో హరీశ్ ఎంపీగా గెలుపొందారు.