గురుకుల విద్యార్థులకు ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం

Is this the Team India for the Champions Trophy?
తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల విద్యార్థులు అనారోగ్యానికి గురైతే దగ్గరలోని ప్రభుత్వాసుపత్రుల్లోనే చికిత్సలు అందించాలని ఆయా గురుకుల ప్రిన్సిపాళ్లకు ఎస్సీ గురుకుల సోసైటీ ఆదేశాలు జారీ చేసింది.
సంబంధిత జిల్లా కలెక్టరు అనుమతి లేకుండా పాఠశాల ,కళాశాల ప్రిన్సిపాళ్లు ప్రైవేటులో చికిత్సకు సొంత డబ్బులు ఖర్చు చేస్తే ఆ మొత్తాన్ని ఇవ్వబోమని స్పష్టం చేసింది.
అత్యవసర సమయాల్లో జిల్లా వైద్యాధికారులని, సూపరింటెండెంట్లను సంప్రదించి అవసరమైన చికిత్సలు చేయించాలి.. వైద్యం అందించాలి. ఎవరైన అధికారులు స్పందించకుండా ఉంటే సోసైటీ కార్యదర్శి దృష్టికి తీసుకురావాలని ఆదేశించింది.
