గుజరాత్ లక్ష్యం 170

టాటా ఐపీఎల్ సీజన్ – 2025లో భాగంగా రాయల్ ఛాలెంజ్స్ ఆఫ్ బెంగళూరు జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఆ జట్టును కేవలం 170 పరుగులకే కట్టడీ చేసింది.
గుజరాత్ బౌలర్లల్లో మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు.. సాయి కిశోర్ రెండు వికెట్లు తీశారు. అర్శద్ ,ఇషాంత్ శర్మ ,ప్రసిద్ధ్ తలో వికెట్ ను తీశారు.
ఆర్సీబీ బ్యాటర్లలో లివింగ్ స్టోన్ (54), జితేశ్ శర్మ (33)పరుగులతో రాణించారు. మరోవైపు సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఏడు పరుగులు.. సాల్ట్ పద్నాలుగు పరుగులు మాత్రమే చేశారు. పడిక్కల్ (4), పాటీదార్ (12)పరుగులతో నిరాశపరిచారు.
