గ్రూప్ – 1 అభ్యర్థుల గోడు పట్టని మేధావి వర్గం & మీడియా…?
తెలంగాణ ఉద్యమం మొదలైందే ఉద్యోగాల కోసం.. 1969లో ఖమ్మం (ఉమ్మడి )జిల్లాలో ఉన్న సింగరేణీ ప్రాంతంలో వలసవాదులకే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు.. స్థానికులకు ఇవ్వడం లేదని చిన్న గొడవతో మొదలైన ఆ ఉద్యమం స్వరాష్ట్ర కాంక్ష కావాలనే స్థాయికి ఎదిగింది. అంటే తెలంగాణ ఏర్పడిందే నీళ్ళు నిధులు నియామకాలకోసం అన్నట్లు. గత బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో నిరుద్యోగ యువత ఏ చిన్న కార్యక్రమం మొదలెట్టిన.. పోరటానికి పిలుపునిచ్చిన కానీ ప్రస్తుత ఎమ్మెల్సీలు బల్మూరి వెంకటి దగ్గర ఎమ్మెల్సీ కొదండరామ్ వరకు.. మరో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న క్యూన్యూస్ నుండి పెద్ద పెద్ద మీడియా ఛానెళ్ల వరకు ప్రతిదీ భూతద్ధంతో చూపించేవారు..
ఒకానోక సమయంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండటమే వేస్ట్.. కాంగ్రెస్ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తాది అన్నట్లు ఆ పార్టీకి ఫేవర్ గా అన్ని ముందు ఉండి నడిపించేవాళ్లని అప్పట్లో టాక్ ఉండేది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో పార్టీలు పక్కనెట్టు. మీడియా పక్కనెట్టు.. యూట్యూబ్ ఛానెళ్ళు పక్కనెట్టు ఏకంగా నిరుద్యోగ యువతనే రోడ్లపైకి వచ్చిన కానీ మీడియా సంగతి దేవుడెరుగు తమకు పదవులు రావడానికి కారణమైన ఆ యువతకోసం ఎమ్మెల్సీలైనవాళ్లతో సహా మేధావులు కనీస స్పందన లేదు.. గురుకుల నియామకాలపై అన్యాయం జరిగిందంటే ఉలుకు లేదు.. ఏఈఈ నియామకాల్లో అవకతవకలు జరిగాయంటే అడ్రస్ లేరు.. మెడికల్ నియామకాల్లో మెజార్టీ ఉన్నవాళ్లకు రాలేదంటే మీసమెత్తు మాట లేదు.
అఖర్కి తాజాగా గ్రూప్ – 1 అభ్యర్థులు తిండి లేక.. తిప్పలు లేక.. నిద్రలు మాని ఆశోక్ నగర్ లో ధర్నాలు రాస్తోరోకులు చేస్తుంటే కనీసం సోయి లేదు.. ఎవరూ ముందుకోచ్చి మేము ఉన్నామనే ధైర్యం ఇవ్వడం లేదు.. కదా మీడియాలో ఓ చిన్న వార్తగా కూడా రావడం లేదనేది నిరుద్యోగ యువత ఆవేదన.. బీఆర్ఎస్ పాలనలో యువతే మాకు ధైవం.. వాళ్లకు ఉపాధి అవకాశాలు కల్పించేదాక బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ ని నిద్రపోనీవ్వము అని ధర్నాలు రాస్తోరోకులు చేసినవాళ్లు ఇప్పుడు అటువైపు కన్నెత్తి చూడటం లేదు.
ఇక మేధావుల సంగతి అయితే అది మా సబ్జెక్టే కాదన్నట్లు వ్యవహారిస్తున్నారు అని గ్రూప్ -1 అభ్యర్థులు తమ బాధను చెప్పుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక్క ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన శ్రేణులు.. నిన్న కాక మొన్న బండి సంజయ్, ఈటల లాంటి వాళ్ళు తప్పా వాళ్ల తరపున గొంతెత్తిన నాధుడే లేడని వారు వాపోతున్నారు.. మావల్ల పదవులు పొందిన మేధావులు ఇప్పుడు మౌనం వహించడం తీవ్ర ఆవేదనను కలిగిస్తుంది అని వారు చెబుతున్నారు. మరి ఇప్పటికైన మేధావులమనే భావించి పదవులు పొందినవాళ్ళు నో