జీతాలు రాక సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రి ఉద్యోగి ఆత్మహత్య

breaking news
చేస్తున్న ఉద్యోగం నుండి టైంకి సరిగ్గా జీతాలు రాకపోవడంతో కుటుంబ సమస్యలతో తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న వసీమ్ ఆత్మహత్య చేసుకున్నారు.
తనను క్షమించాలంటూ భార్యకు రాసిన సూసైడ్ లెటర్ కన్నీళ్లు పెట్టిస్తోంది. ‘డియర్ రజనీ. నిన్ను చాలా బాధపెట్టా. మనకు ఎవరూ లేరు. పిల్లలు అలా కాకూడదని చాలా ఊహలు కన్నాను.
కానీ ఏదీ కుదరలేదు. వచ్చే జన్మలో నా పిల్లలకే కొడుకుగా పుడతా’ అని రాశారు. తాను కొందరి వద్ద చేసిన అప్పును చెల్లించాలని తన భార్యను వసీమ్ కోరారు.
