తెలుగు తమ్ముళ్లు కాలర్ ఎగరేసుకునే వార్త -వీడియో
ఇది నిజంగా తెలుగు తమ్ముళ్లు తమ కాలర్ ఎగరేసుకునే వార్త. సహజంగా సీఎం స్థాయి వ్యక్తి అందరిలో ప్రత్యేకంగా కన్పించాలని చూస్తారు. కానీ దానికి భిన్నంగా టీడీపీ అధినేత.. రేపు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోయే నారా చంద్రబాబు నాయుడు ఈరోజు జరుగుతున్నా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శాసనసభా పక్ష భేటీలో చంద్రబాబు కోసం స్పెషల్ ఛైర్ వేయగా ఆయన దాన్ని మార్పించారు.
ఇదే వేదికపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ చీఫ్ పురందీశ్వరికి వేసినటువంటి సాధారణ కుర్చీనే తనకూ వేయాలని చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్న సిబ్బందిని కోరారు.
వెంటనే వారు కుర్చీ మార్చారు. ఈ వీడియో వైరలవుతోంది. కూటమిలో సమైక్యతను, సమానత్వాన్ని చాటేందుకే బాబు ఇలా చేశారని టీడీపీ వర్గాలంటున్నాయి. మరి ఇది గొప్ప విషయమే కదా.