ఎన్డీఏ రాష్ట్రాలకు శుభవార్త
కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటం వల్ల ఎన్డీఏ ప్రభుత్వాలున్న ఏపీ,బిహార్లపై బడ్జెట్ 2024-25 నుంచి నిధుల వర్షం కురిసింది.
ఏపీలో అమరావతి అభివృద్ధికి రూ.15వేల కోట్ల సాయంతో పాటు పోలవరం నిర్మాణానికి సాయం, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద కేంద్రం నిధులివ్వనుంది.
మరోవైపు బిహార్లో రోడ్ల అభివృద్ధికి రూ.26వేల కోట్ల సాయంతో పాటు ఎయిర్పోర్టులు, మెడికల్ కాలేజీల నిర్మాణాలు, స్పోర్ట్స్ పరంగా అభివృద్ధి చేయనుంది.