పెన్షన్ దారులకు శుభవార్త
ఏపీలోని ఆసరా పెన్షన్ లబ్దిదారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం శుభవార్తను తెలిపింది.
అందులో భాగంగా రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఉంటున్నవారు ఇకపై ఆసరా పెన్షన్స్ కోసం సొంత ఊర్లకు రావాల్సిన అవసరంలేదు.. ఎందుకంటే ఉపాధి కోసం వేరే కారణాల వల్ల సొంత ఊర్ల నుండి ఇతర ఊర్లలో ఉంటున్నవారు తమ ఆసరా పెన్షన్స్ కోసం అడ్రస్ మార్చుకోవచ్చు..
ఈ ప్రక్రియను ఆసరా బదిలీ కార్యక్రమంలో చేయనున్నారు.. ఇందుకు అక్కడి అడ్రస్, పిన్ కోడ్ జతపర్చాలి అంతే. ఒక్కసారి ట్రాన్స్ఫర్ అయ్యాక నెలనెలా ఉన్నచోటనే పెన్షన్ తీస్కోవచ్చు…