కొత్త రేషన్ కార్డులపై గుడ్ న్యూస్
అర్హులైన లబ్ధిదారులకు అందించే కొత్త రేషన్ కార్డుల గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా ఆక్టోబర్ నెల నుండి అర్హులైన వారి నుండి నూతన రేషన్ కార్డుల మంజూరు కోసం దరఖాస్తులను స్వీకరించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
నూతన రేషన్ కార్డుల మంజూరు గురించి విధివిధానాలపై క్యాబినెట్ సమావేశంలో చర్చించారు. వచ్చే ఏడాది జనవరి నెల నుండి రేషన్ కార్డు హోల్డర్స్ కు సన్నబియ్యం పంపిణీ చేస్తాము.
అంతేకాకుండా ఈ ఖరీఫ్ సీజన్ నుండే సన్నబియ్యం పండించే రైతులకు క్వింటాల్ కు రూ.500లు బోనస్ అందిస్తామని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.