తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..!

anumula revanth reddy
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. మార్చి ముప్పై ఒకటో తారీఖుతో ముగిసిన ఎల్ఆర్ఎస్ గడవును ఏఫ్రిల్ ముప్పై తారీఖు వరకూ పెంచుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.
ఏఫ్రిల్ ముప్పై తారీఖు వరకూ ఎల్ఆర్ఎస్ కు ఇరవైఐదు శాతం రాయితీతో అవకాశం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటివరకూ ప్రభుత్వానికి ఎల్ఆర్ఎస్ కింద లేఅవుట్లను క్రమబద్ధీకరించడంతో వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలుస్తుంది.
ఎల్ఆర్ఎస్ కు 15.27 లక్షల దరఖాస్తులు వచ్చాయి. రూల్స్ ను పాటించలేదని 15,894 దరఖాస్తులను సంబం ధితాధికారులు తిరస్కరించారు. 6. 87లక్షల దరఖాస్తులు ప్రాసెస్ అయితే దీనికింద వచ్చిన ఫీజులు మొత్తం రూ. 8.65 లక్షలు పెండింగ్‌లో ఉంది. వీటితో పాటు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించిన దరఖాస్తులు 2.6 లక్షలుగా అధికారులు తెలిపారు.
