ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏపీలో పని చేయడానికి కేటాయించబడిన తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుభవార్తను తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కొంతమంది ఉద్యోగులకు కేటాయించిన సంగతి తెల్సిందే.
దాదాపు 122మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను రీలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలను జారీ చేసింది. దీంతో తెలంగాణలో పని చేయాలన్న వారి కల నెరవేరినట్లు అయింది. గతంలోనే పలుమార్లు ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రాంత ఉద్యోగులు విన్నవించుకున్న సంగతి తెల్సిందే.