తెలంగాణ రైతాంగానికి శుభవార్త

 తెలంగాణ రైతాంగానికి శుభవార్త

తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది.. అందులో భాగంగా ఇటీవల లక్ష లోపు రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా లక్షన్నర లోపు రుణాలను మాఫీ చేయడానికి సిద్ధమైంది..

ఇందులో భాగంగా రేపు మంగళవారం రెండో దశలో రుణమాఫీ ప్రక్రియకు ప్రభుత్వం సిద్ధమైంది.. దీంతో రూ .లక్ష యాబై వేల లోపు రుణాలను మాఫీ చేయడానికి అర్హులైన రైతుల ఖాతాల్లో డబ్బులను రేపు జమచేయనున్నట్లు తెలిపింది.

ఇప్పటికే లక్ష లోపు ఉన్న దాదాపు పదకొండున్నర లక్షల రైతులకు సంబంధించి లక్ష లోపు రుణాలను మాఫీ చేయడానికి ఆరున్నర వేల కోట్ల రూపాయలను విడుదల చేసింది .. తాజాగా లక్షన్నర లోపు రుణాలను మాఫీ చేయడానికి సిద్ధమైంది.. ఆగస్ట్ నెలలోపు రెండు లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెల్సిందే.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *