టీమిండియాకు శుభవార్త…!
గత రెండు టీ20లకు గాయం కారణంగా దూరమైన భారత ప్లేయర్ రింకూ సింగ్ నాలుగో T20కి అందుబాటులో ఉండనున్నట్లు క్రీడావర్గాలు పేర్కొన్నాయి.
తొలి మ్యాచులో ఆడిన రింకూకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కాగా మూడో టీ20లో భారత జట్టు బ్యాటర్ల వైఫల్యంతో ఓడిన సంగతి తెలిసిందే.
దీంతో రింకూ చేరితే జట్టుకు బలం చేకూరే అవకాశముంది. ఇంగ్లండ్ జట్టుతో నాలుగో టీ20 ఇవాళ పూణే వేదికగా జరగనున్నది.