రేషన్ కార్డులున్నవారికి శుభవార్త
రేషన్ కార్డు లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. వచ్చే ఏడాది జనవరి నెల నుండి రేషన్ కార్డు ఉన్న వాళ్లకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
జనవరి నుండి రేషన్ షాపుల ద్వారా ప్రస్తుతం ఉన్న విధానం మాదిరిగా ఒక్కొక్కర్కి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తాము.
మరోవైపు త్వరలోనే కొత్తగా జారీ చేసే డిజిటల్ కార్డుల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని పేర్కొన్నారు. అర్హులైన పేదవాళ్లకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లను ఇస్తామని కూడా ఉద్ఘాటించారు.