పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

 పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

Ap Deputy Cm

Loading

వచ్చే నెల సెప్టెంబర్ 2 తారీఖున ఏపీ డిప్యూటీ సీఎం… జనసేన అధినేత.. ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించాలని మస్త్ జోష్ లో ఉన్న ఆయన అభిమానులకు ఇది మంచి కిక్ ఇచ్చే వార్త..

ఇప్పటికే పీకే పుట్టిన రోజు సందర్భంగా పవర్ స్టార్ కు వరుస ప్లాప్ ల తర్వాత కమ్ బ్యాక్ హిట్టిచ్చిన గబ్బర్ సింగ్ రిరీలీజ్ కానున్నది. అదే రోజున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ కాంబోలో తెరకెక్కుతున్న ఓజీ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ రానున్నట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ఇప్పటికే దీనికి సంబంధించిన పనులన్నీ పూర్తయినట్లు తెలుస్తుంది. ఈ మూవీలో ప్రియాంక అరుళ్ మోహాన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తుండగా డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *