ఇందిరమ్మ ఇండ్లను కట్టుకునేవారికి శుభవార్త..!

Indiramma Houses Holders
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో ఒకటి ఇందిరమ్మ ఇండ్ల పథకం. నియోజకవర్గానికి మూడువేల ఐదు వందల చొప్పున నూటపంతొమ్మిది నియోజకవర్గాలకు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అర్హులను గుర్తించి ఇండ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకుంటున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఓ శుభవార్తను తెలిపింది.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇకపై ఆధార్ ఆధారిత చెల్లింపులు చేపట్టాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలు, ఐఫ్ఎస్సీ నంబర్లలో తప్పుల వలన ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం చెల్లింపులు లబ్ధిదారులకు ఆలస్యమవుతుంది. దీంతో ఇటు లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణం భారం కావడమే కాకుండా ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుంది. దీనిపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున లబ్ధిదారుల నుంచి పిర్యాదులు సైతం వచ్చాయి.
తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,100 ఆధార్ ఆధారిత చెల్లింపులు చేపట్టగా మెరుగైన ఫలితాలు కనిపించా యి. దీంతో ఇదే విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. లబ్ధిదారులకు ఆధారిత చెల్లింపుల విధానం అమలు చేయాలని. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా సంబంధితాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.