రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూరగాయలు సాగుచేసే రైతులు శాశ్వత పందిళ్ళు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకునేందుకు సాయపడాలని నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయంలో భాగంగా శాశ్వత పందిళ్లకు ఎకరాకు రూ. 3లక్షలు ఖర్చు అవుతుంది. అందుకే ఈ ఖర్చులో యాబై శాతం సబ్సిడీ ఇవ్వనున్నది రాష్ట్ర ప్రభుత్వం .
అయితే ఈ పథకాన్ని తొలుత నిజామాబాద్ జిల్లా బోధన్ లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నది. తీగ జాతి కూరగాయల సాగుకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఈ పథకం అమలుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ నిధులను వినియోగించనున్నట్లు టాక్.