బీఆర్ఎస్ శ్రేణులకు శుభవార్త…!

Good news for BRS ranks…!
భారత రాష్ట్ర సమితి పార్టీ ఏర్పడి ఇరవై ఐదు వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఎల్కతుర్తి వేదికగా రజతోత్సవ వేడుకల పేరుతో ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత.. మాజీ సీఎం కేసీఆర్ వ్యూహారచనలు చేస్తున్న సంగతి తెల్సిందే.
ఈ క్రమంలో వరంగల్ సిటీ పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు చేయనున్నట్లు సీపీ ప్రకటించారు. దీంతో తమ సభకు ఎలాంటి అటంకులు సృష్టించకుండా సభకు అనుమతి ఇవ్వాలని హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ వేసింది.
ఈ పిటిషన్ పై విచారణ జరుగుతున్న క్రమంలోనే వరంగల్ పోలీస్ శాఖ సభకు అనుమతి ఇస్తున్నట్లు నిన్న బీఆర్ఎస్ కు లేఖ రాసింది. సభ జరగకుండా ప్రభుత్వం కుట్రలు చేస్తుందని భావించిన బీఆర్ఎస్ శ్రేణులకు పోలీస్ శాఖ అనుమతివ్వడంతో మున్ముందు ఎలాంటి అటంకులు లేకుండా సభ సజావుగా సాగుతుందని వారు భావిస్తున్నారు.
