బీసీలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్..!
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన బీసీ కులగణన పై తీవ్ర అసంతృప్తిగా ఉన్న బీసీ సామాజిక వర్గ నేతలను.. ఆ వర్గాలను సంతృప్తి పరిచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ శుభవార్తను తెలపనున్నట్లు తెలుస్తుంది.
తాజాగా నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో బీసీల కేంద్రంగా తాజా సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో ఇద్దరు బీసీలకు అవకాశం ఇవ్వాలని రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్లు సమాచారం.
ఇందులో ఒక డిప్యూటీ సీఎం పదవి ఉంటుందని గాంధీ భవన్ వర్గాల టాక్. ఎస్టీ, మైనార్టీ, రెడ్డి, వెలమ సామాజికవర్గాల నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేయాలనుకుంటున్నట్లు కూడా గాంధీభవన్ నుండి వార్తలు వస్తున్నాయి. అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ రాగానే ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.