ఏపీ ప్రజలకు బాబు న్యూ ఇయర్ కానుక..!
ఏపీ ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సకల తెలుగు ప్రజలందరూ సుఖసంతోషాలతో.. అష్ట ఐశ్వర్యాలతో కుటుంబ సభ్యులందరూ 2025 సంవత్సరం గడపాలని ఆయన కోరుకున్నారు.
ఈక్రమంలో ఏపీ ప్రజలకు న్యూఇయర్ కానుకను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం గత ఆరు నెలలుగా ఇప్పటికే పలు సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేశాము.. కొత్తవి చేస్తున్నాము. 2025 కొత్త ఏడాది కొత్త సంక్షేమ.. అభివృద్ధి పథకాలకు నాంది పలకబోతుంది..
కేవలం ఆరు నెలల్లోనే సుపరిపాలనను ఆవిష్కృతం చేశాము. ఫించన్ల మొత్తాన్ని భారీగా పెంచాము. మహిళమణులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తున్నాము.. ధాన్యం పైసలు చెల్లించాము. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై ఉన్న గుంతలను లేకుండా చేస్తున్నాము. పెట్టుబడులు తీసుకోచ్చి యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.