పెరిగిన బంగారం ధరలు..?

హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.550లు పెరిగి రూ.80,650లకు చేరింది.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600 పెరగడంతో రూ.87,980 లకు చేరింది. కాగా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
కేజీ వెండి రూ.1,07,000 వద్ద కొనసాగుతోంది. వివాహాది శుభకార్యాల నేపథ్యంలో బంగారం, వెండికి భారీగా డిమాండ్ నెలకొంది.
