కొత్త రేషన్ కార్డుల జారీపై సబ్ కమిటీ
తెలంగాణలో అర్హులైన వారికీ కొత్త రేషన్ కార్డుల జారీ కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది…
దీనికి సంబంధించి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా.. మంత్రులు దామోదర రాజానర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను సభ్యులుగా నియమిస్తూ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది .
ఈ కమిటీ కొత్త రేషన్ కార్డుల జారీ కోసం పరిశీలన జరిపి విధి విధానాలను ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నట్లు తెలుస్తుంది.. ఇప్పటికే రేషన్ కార్డులు లేక రైతురుణమాఫీ లాంటి పథకాలు అందటంలేదని బాధితులు చాలా చోట్ల వాపోతున్న సంగతి తెల్సిందే..