అల్లం తినడం వల్ల లాభాలు ఏంటి…?
ప్రతిరోజూ అల్లం తినడం వల్ల అనేక లాభాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు. అల్లం నేడు మన జీవితంలో ఓ భాగమైంది.. అల్లాన్ని ఏదోక రూపంలో మనం తీసుకుంటూనే ఉంటుంటాము. అల్లంలో యాంటీ ఇన్ ఫ్లామెటరీ గుణాలు దాగి ఉంటాయి.
ఈ గుణాలు మెదడును చురుకుగా ఉండే విధంగా చేస్తాయి. నోటి దుర్వాసన రాకుండా నియంత్రిస్తాయి. జలుబు,దగ్గు,కఫం ను తగ్గిస్తుంది. బరువులో తగ్గడం లోనూ ఇది సహాయ పడుతుంది. అల్సర్,అజీర్తి ,షుగర్ కీళ్ల నోప్పి వంటి పలు సమస్యలను పరిష్కరిస్తుంది.
మలబద్ధకం, గ్యాస్ తొలగిపోతాయి. పీరియడ్స్ సమయంలో అల్లం ముక్కను నమలడం వలన నొప్పి, తిమ్మిరి ఫిర్యాదులు తగ్గుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే, చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. ఖాళీ కడుపుతో అల్లం తీసుకోవడం వలన జీవక్రియ రేటు పెరుగుతుంది.