మంత్రి కోమటిరెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటిరెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” మూసీ నది ప్రక్షాళనకు బీఆర్ఎస్ అడ్డుపడుతుంది.
నల్గోండ జిల్లా రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతుంది. నల్గోండ జిల్లా ప్రజల జోలికి వస్తే ఊరుకోనేదిలేదని అంటున్న కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు నలగోండ రైతులకు ఏమి చేశారు. ఇప్పుడు మంత్రిగా ఉండి ఏమి చేశారు. చేయాల్సింది మూసీ నది ప్రక్షాళన కాదు.
మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూతి.. మీ మూతి ప్రక్షాళన చేయాలని ఆయన అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ “మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాదు.. కొజ్జా వెంకట్ రెడ్డి అంటూ హాట్ కామెంట్స్ చేశారు.రామన్నపేటలో పెట్టనున్న అదానీ – అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది.. దీనిపై కోమటిరెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు అని ప్రశ్నించారు.