మా జీవితాల్ని మార్చేసిన చిత్రం ” గబ్బర్ సింగ్”

 మా జీవితాల్ని మార్చేసిన చిత్రం ” గబ్బర్ సింగ్”

Harish Shankar Bandla Ganesh

Loading

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా…. అందాల రాక్షసి శృతి హాసన్ హీరోయిన్ గా… ఆలీ,కోట శ్రీనివాస్ రావు, అజయ్,నాగినీడు తదితరులు ప్రధాన పాత్రలో నటించగా బండ్ల గణేశ్ నిర్మాతగా… హారీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కి 2012లో విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేసి రికార్డుల మోత మ్రోగించిన మూవీ ” గబ్బర్ సింగ్”.. ఈ సినిమాను పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా రేపు సెప్టెంబర్ 2 న రిరిలీజ్ చేస్తున్నారు.

దాని ప్రమోషన్లో భాగంగా దర్శక నిర్మాతలు హారీష్ శంకర్,బండ్ల గణేశ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు హారీష్ శంకర్ మాట్లాడుతూ ” సామాజిక మాధ్యమాల వాడకం ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో గబ్బర్ సింగ్ విడుదలై ఉంటే బాగుండేది అనుకునేవాడ్ని.. రేపు రిరిలీజ్ తో ఆ కోరిక తీరనున్నది. మాజీవితాలని మార్చేసిన చిత్రం ఇది.

ఇది మేము ఊహించని దానికంటే భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్ర విజయాన్ని ముందే ఊహించిన మొట్ట మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్. డబ్బింగ్ సమయంలో ఆయన ఇది పక్కా బ్లాక్ బస్టర్ అన్నారు. అదే నిజమైంది” అని అన్నారు. మరోవైపు నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ “నేను ఆర్థికంగా ఏ స్థాయికెళ్లిన పవన్ కళ్యాణ్ లేకపోతే ఈ పేరు,క్రేజ్ ఉండేది కాదు.. ఆయనతో గబ్బర్ సింగ్ చేయడం నా అదృష్టం “అని అన్నారు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *