వరద బాధిత జిల్లాలకు నిధులు విడుదల

Anumula Revanth Reddy
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో వరదలతో నష్టపోయిన వరద బాధితులకు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది.
అందులో భాగంగా ఇటీవల భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన జిల్లాలకు చెందిన బాధితుల కోసం తక్షణ సాయం కింద రెండోందల కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ వరదలకు, వర్షాలకు తీవ్రంగా ప్రభావితమైన కామారెడ్డి, మెదక్, నిర్మల్ , ఆదిలాబాద్, నిజామాబాద్, ఆసిఫాబాద్, సిరిసిల్ల జిల్లాలకు రూ పదికోట్ల చొప్పున, ఇతర జిల్లాలకు ఐదు కోట్ల రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నది.
అయితే ఈ నిధులను ముందుగా రోడ్లు, & వంతెనల మరమ్మతులు, విద్యుత్ పునరుద్ధరణ, వరద బాధితులకు పునరావాసం, ఉపశమనం కోసం ఉపయోగించనున్నారు.