యాసంగికి రైతు భరోసా..!

డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో ఆదివారం రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది.ఈ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు..
సుదీర్ఘంగా దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన భేటీ జరిగింది.ఈ భేటీ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిరైతు మోములో వెలుగు నింపే ఆశయంతో రూ. 72,659 కోట్ల వ్యవసాయ, అనుబంధ రంగాల బడ్జెట్ పెట్టడం జరిగింది.
ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం ప్రజా ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేందుకు కట్టుబడి ఉంది అని సగర్వంగా తెలియజేస్తున్నాము.రానున్న యాసంగి పంటకు రైతు భరోసా అందజేసేందుకు ఖరారు చేయాల్సిన విధి విధానాలపై కేబినెట్ సబ్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించడం జరిగిందని అన్నారు..