ఈనెల 22నుండి అసెంబ్లీ సమావేశాలు
ఈ నెల 22నుండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో భేటీ అయిన మంత్రివర్గం నిర్ణయించింది.. అంతేకాకుండా పంటల భీమా పథకానికి ప్రీమియమ్ చెల్లింపు విధివిధానాలపై ఆధ్యాయనానికి కమిటీ వేయాలని నిర్ణయించారు..
అంతేకాకుండా అసెంబ్లీ సమావేశాలను మూడు రోజుల పాటు నిర్వహించాలి..ఈ సెషన్లోనే ఓటాన్ అకౌంటు బడ్జెట్ ప్రవేశపెట్టాలా..వద్దా..? ..తొలిరోజు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు మొదలు పెట్టాలి ఇలా అనేక అంశాలపై ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రివర్గం చర్చించింది.
ఈ రోజు సాయంత్రం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలు దేరి వెళ్లనున్నారు..ఈ పర్యటనలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ,హోం మంత్రి అమిత్ షా ఇలా పలువురు కేంద్రమంత్రులను ఆయన కలవనున్నారు..ప్రధానమంత్రి నరేందర్ మోదీ అపాయింట్మెంట్ ను కూడా కోరినట్లు ఏపీసీఎంఓ వర్గాలు తెలిపాయి..