రేవంత్ రెడ్డికి షాకిచ్చిన ఆ 4గురు ఎమ్మెల్యేలు ..!

 రేవంత్ రెడ్డికి షాకిచ్చిన ఆ 4గురు ఎమ్మెల్యేలు ..!

గురువారం మర్రి చెన్నారెడ్డి భవన్ లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టీ విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ దీపా మున్సీ ఆధ్వర్యంలో సీఎల్పీ భేటీ జరిగింది. ఈ భేటీ సుధీర్ఘంగా జరిగింది. ఏడాదిగా ఇటు పార్టీలో.. అటు ప్రభుత్వంలో జరిగిన మంచి చెడ్డల గురించి చర్చ జరిగింది.

ఎమ్మెల్యేలు.. మంత్రులు..ఎమ్మెల్సీలు తమ గోడును వెల్లబుచ్చుకున్నారు. ఈ భేటీకి పార్టీ తరపున అందరూ ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు హాజరైన కానీ ఓ నలుగురు మాత్రం డుమ్మా కొట్టారు. వారిలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ముందు నుండి పార్టీ కార్యక్రమాలకు ముఖ్యంగా రేవంత్ రెడ్డికి దూరంగా ఉంటున్న దొంతి మాధవరెడ్డి, వాకాటి శ్రీహారి, మల్రెడ్డి రంగారెడ్డి నలుగురు ఎమ్మెల్యేలు హాజరు కాలేదు.

అయితే వ్యక్తిగత కారణాలతోనే హాజరు కాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేలు సైతం హాజరు కాలేదు. ప్రస్తుతం అధికార పార్టీలో హాట్ టాఫిక్ అయిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సైతం పాల్గోనలేదు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *