ఏపీ లో రాష్ట్రపతి పాలన పెట్టాలి …?

New IT pillars..!
ఏపీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జనసేన టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి మహిళలపై… ఆడపిల్లలపై ఎన్నో అఘాత్యాలు జరుగుతున్నాయి.
రోజుకో అత్యాచారం జరుగుతుంది.. రెండు రోజులకో హాత్య జరుగుతుంది. ప్రజాప్రతినిధులకు రక్షణ లేదు.. ఆ ప్రజాప్రతినిధుల కుటుంబాలకు రక్షణ లేదు.. సామాన్యుల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు.
దయచేసి ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని మాజీ మంత్రి.. వైసీపీ మహిళ నాయకురాలు ఆర్కే రోజా డిమాండ్ చేశారు.కూటమి పాలనలో ఆడపిల్లల తండ్రుల కంటిమీద కునుకు లేదు. రెడ్ బుక్ ను ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టి కొట్టడానికి కాకుండా ప్రజలను కాపాడటానికి వాడాలని ఆమె సూచించారు.
