టీటీడీపీలోకి మాజీ ఎమ్మెల్యే…?
తెలంగాణ టీడీపీలో తాను చేరనున్నట్లు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం తీగల కృష్ణారెడ్డి టీడీపీ చీఫ్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో హైదరాబాద్ లో ఆయన నివాసంలో భేటీ అయ్యారు.
తెలంగాణ టీడీపీకి పూర్వవైభవం తీసుకోస్తానని ఆయన అన్నారు. మరోవైపు టీడీపీ నుండి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన 2009లో ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటి చేసి ఓడిపోయారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో అదే పార్టీ నుండి బరిలోకి దిగి గెలుపొందారు. అనంతరం అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ లో చేరారు.