పవన్ కళ్యాణ్ ” ఇదేమి సినిమా కాదు”..!

 పవన్ కళ్యాణ్ ” ఇదేమి సినిమా కాదు”..!

Pawan Kalyan: “This is not a movie”..!

Loading

ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రముఖ సినిమా నటుడు ప్రకాష్ రాజ్ మరోకసారి ఫైర్ అయ్యారు.ఓ ఇంటర్వూలో పాల్గోన్న ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ఇంటర్వూలో రాజకీయాలు.. సినిమాల గురించి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులపై తనదైన శైలీలో స్పందించారు.

ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అది చేస్తాను. ఇది చేస్తాను. స్వర్గాన్ని కిందకు దించుతాను అని హామీలిచ్చిన పవన్ కళ్యాణ్ తీరా అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారు.. గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీను నెరవేర్చకుండా టైం పాస్ ముచ్చట్లు చెబుతున్నారు.

పవన్ కళ్యాణ్ ఇదేమి సినిమా కాదు. టైం పాస్ ముచ్చట్లు ఎందుకు. ఇప్పటికైన ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలి. ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలపై మాట్లాడాలి. ఒకపక్క మహిళలకు రక్షణ లేకుండా పోతుంది.కూటమి ప్రభుత్వ పాలనలో నేరాల సంఖ్య పెరిగింది. ప్రజలకు మంచి పాలనను అందించాలని ప్రకాష్ రాజ్ సూచించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *